ఏ బుక్‌ ఉండదు నూతన డీజీపీ శివధర్ రెడ్డి కీలక కామెంట్స్..

డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. ఏ లక్ష్యంతో నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తా.. నా మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడం.. అందుకోసం అన్నివిధాల సన్నద్ధం అవుతున్నాం అంటూ తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ 6వ డీజీపీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు..లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి ఛాలెంజ్. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నాం. పోలీస్ శాఖలో 17000 ఖాళీలు ఉన్నాయి. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని శివధర్ రెడ్డి అన్నారు. బేసిక్ పోలీసింగ్‌తో సాంకేతికను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామని చెప్పారు..