ధర్మస్థలలో దుస్తులు లేకుండా 100కి పైగా మహిళల మృతదేహాలు

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల (Dharmasthala)’ లో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిట్‌ చీఫ్‌ (SIT chief) ప్రణబ్‌ మొహంతి (Pranab Mohanty), డీఐజీ (DIG) ఎంఎన్‌ అనుచేత్‌ (MN Anucheth) ఆధ్వర్యంలో ధర్మస్థల మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది… మహిళల మృతదేహాలు చాలా వరకు లో దుస్తులు కూడా లేకుండా ఉన్నాయి. అందులో చాలా మంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయి. వారిపై హత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఇలాంటి 100కు పైగా మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను.” ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన మాటలివి. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో.. గతంలో పని చేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు (విజిల్‌బ్లోయర్) జూన్ 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుంచి 2014 వరకు వందకుపైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సమర్పించాడు. అయితే ఈ విజిల్‌బ్లోయర్ వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి..
నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలివైపు ఉన్న ప్రాంతం నుంచి అధికారులు పరిశోధన ప్రారంభించారు. కాగా ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి మానేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. సంచలన విషయాలు బయటపెట్టాడు. 1998 నుంచి 2014 మధ్య అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పోలీసులకు చెప్పాడు…

ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు.. ఆ శవాలను స్వయంగా తానే ఖననం చేశానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు షాకింగ్ ఆరోపణలు చేశాడు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు. తన 20 ఏళ్ల సర్వీసులో, వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని వెల్లడించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని ఆరోపించాడు. “నాకు ఇష్టం లేకపోయినా, నాతో బలవంతంగా ఈ పని చేయించారు. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారు,” అని అతను పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు, ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని, కొన్ని సందర్భాల్లో శవాలను నదిలో విసిరేశానని వెల్లడించాడు..

హత్యల వెనుక ఆలయ నిర్వాహకుల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఈ కార్మికుడు ఆరోపిస్తున్నాడు. దీంతో శవాలను ఖననం చేయమని ఆదేశించిన వారు ఎవరు? ఈ రహస్యం ఇన్నాళ్లూ ఎలా దాగింది? అనేది సంచలనం కలిగిస్తోంది. ఆలయంలోని పెద్దల ఆదేశాల మేరకే తాను ఈ దారుణాలకు పాల్పడినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. “నీవు నోరు విప్పితే, నీ కుటుంబాన్ని కూడా ఇలాగే చంపేస్తాం,” అని బెదిరించారని వెల్లడించాడు. 1998లో ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, తనను దారుణంగా కొట్టారని, ఆ తర్వాత నోరు మూసుకున్నానని చెప్పాడు. 2014లో తన కుటుంబంలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అందుకే భయంతో ధర్మస్థల వదిలేసి పొరుగు రాష్ట్రానికి పారిపోయానట్లు తెలిపాడు. దశాబ్దం తర్వాత, అపరాధ భావంతో తిరిగి వచ్చినట్టు వెల్లడించారు. ఒక శవాన్ని వెలికితీసిన ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు.

పారిశుద్ధ్య కార్మికుడి ఆరోపణలు పోలీసులను కూడా ఉలిక్కిపడేలా చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా FIR నమోదు చేసిన పోలీసులు, దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. జులై 4న ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో BNS కింద హత్య కేసు నమోదైంది. 1995 నుంచి 2014 వరకు, దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని కార్మికుడు ఆరోపించాడు. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగాయని చెప్పాడు. 2010లో 12-15 ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్‌తో ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి, న్యూస్ పేపర్ లో చుట్టి డీజిల్‌తో కాల్చినట్లు వెల్లడించాడు…

మిస్సింగ్ కేసులపై ఫిర్యాదులు లేవా?

వందలాది మంది హత్యకు గురయ్యారంటే, వారి కుటుంబాలు ఎందుకు నోరు విప్పలేదు? ధర్మస్థలలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్లూ అవి ఎందుకు బయటకు రాలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు తర్వాత, అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం, 1995-2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్థులు, మైనర్ బాలికలు ఉన్నారు. అయితే, ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది.

మిస్సింగ్ కేసులు, హత్యలపై ఆందోళనలు

గతంలోనూ ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై ఆందోళనలు జరిగాయి. కానీ అవన్నీ అణచివేయబడ్డాయి. దీంతో ఈ హత్యల వెనుక ఎవరో పెద్దలు ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. ధర్మస్థలలో గతంలో అనేక ఆందోళనలు జరిగాయి. 2013లో సౌజన్య హత్య కేసుపై CPM నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. కానీ పెద్దల ఒత్తిడితో అవి సద్దుమణిగాయి. 1987లో పద్మలత అనే 17 ఏళ్ల బాలిక హత్య కేసు దర్యాప్తు కూడా సరిగా సాగలేదు. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపణ కాలేదు. పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ హత్యల వెనుక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారని ఆరోపించాడు. అయితే ఆలయ ఆస్తులు, దానాల ద్వారా వచ్చే భారీ ఆదాయం, భూ వివాదాలు కొన్ని హత్యలకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఈ భయానక ఆరోపణల తర్వాత కర్నాటక ప్రభుత్వం మేల్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసింది. కానీ, ఈ దర్యాప్తుపై స్థానికుల్లో అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. జులై 19న కర్నాటక ప్రభుత్వం IPS అధికారి ప్రణవ్ మోహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ తీరంతోపాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టింది. సాక్షుల విచారణ ప్రారంభించింది. ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తోంది. కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం, సమర్పించిన ఆధారాల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టింది. అయితే, గతంలో సౌజన్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం వహించడం, CCTV ఫుటేజీలు తొలగించడం లాంటివి పెద్దల జోక్యాన్ని సూచిస్తున్నాయి..