ఢిల్లీ: ముగిసిన సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల నిరాహార దీక్ష..!

ఢిల్లీ: ముగిసిన సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ 26 రోజుల నిరాహార దీక్ష..

అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్‌ సమక్షంలో దీక్ష విరమణ..

గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో దీక్ష విరమింపజేసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా..

‘లే లడాక్‌ సర్వోన్నత మండలి’ సీనియర్‌ నేతల సమక్షంలో కప్పుతో నీరు తాగించిన జేపీ నడ్డా.. అంతిమంగా దీక్ష విరమించినట్లు ప్రకటించిన సోనమ్‌ వాంగ్‌చుక్‌…

దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. విద్యార్థుల ఆందోళనలు, విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు సోనమ్ వాంగ్‌చుక్‌తో సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల సందర్భంగా పరీక్షల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వీడియో ప్రకటనతో పాటు, విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చారు…కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ మరియు లేహ్ లడఖ్ అపెక్స్ బాడీ సీనియర్ నాయకుల సమక్షంలో ఇప్పుడే 26 రోజుల నిరాహార దీక్షను విరమించాను,” అని వాంగ్‌చుక్ అర్ధరాత్రి తర్వాత ఒక పోస్ట్‌లో తెలిపారు.