ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి శుక్రవారం వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలతో సమావేశం కానున్నారు.శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన తీరికలేని షెడ్యూల్తో బిజీ అయ్యారు…శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి.. న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీని తాజ్ ప్యాలెస్ లో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల గురించి, ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అమెరికా అభివృద్ధికి తెలుగు ప్రవాసులు ఎలా దోహద పడుతున్నారో ఆయన వివరించనున్నారు.
అమెరికా కంపెనీలకు తెలంగాణలో వ్యాపార అవకాశాలు గురించి వివరించనున్నారు సీఎం. ఇదే క్రమంలో ఫ్యూచర్ సిటీ గురించి తెలియజేనున్నారు. ఆ తర్వాత మీడియా హౌస్ వార్షిక ఫోరమ్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించనున్నారు…