కేసీఆర్ పాత్ర ఇవ్వగానే వెంటనే ఒప్పుకున్నాడు.. తానే స్వయంగా రీసెర్చ్ చేశాడు: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

కేసీఆర్ పాత్ర ఇవ్వగానే వెంటనే ఒప్పుకున్నాడు.. తానే స్వయంగా రీసెర్చ్ చేశాడు: దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

నాని హీరోగా నటించిన ‘పారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకర్ పాత్రలో ప్రియదర్శి నటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కేసీఆర్‌ను పోలిన గెటప్, తెలంగాణ యాస, హావభావాలతో ప్రియదర్శి పోషించిన ఈ పాత్రపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ, ఈ పాత్ర పోషించమని అడగగానే ప్రియదర్శి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నారని తెలిపారు. పాత్రలో పరిపూర్ణత కోసం ప్రియదర్శి స్వయంగా కేసీఆర్‌పై పరిశోధన చేసి, ఆయన మాట తీరు, నడక, హావభావాలను ఔపోసన పట్టి తెరపై ఆవిష్కరించారని దర్శకుడు కొనియాడారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సినిమాను థియేటర్‌లో వీక్షించి ప్రశంసించడం విశేషం.