హ్యాట్సాఫ్ డాక్టర్ మమత..!
9 సార్లు సీపీఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడిన డాక్టర్ మమత..
ఇదీ నిజంగా మెడికల్ మిరాకిల్ అని తెలిపిన డాక్టర్ మమత రెడ్డి..
ఉదయం 8 గంటల నుంచి ఆయనను కాపాడేందుకు వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించిన డాక్టర్ మమత..
చివరికి 9వ సారికి సీపీఆర్ ఫలించి.. గుండె లయ కొట్టుకోవడంతో హ్యాట్సాఫ్ మమత అంటూ అక్కడికి వచ్చిన నేతలు అభినందించారు…
ఇటీవల కాలంలో సి పి ఆర్ గురించి డాక్టర్లు చాలా అవగాహన కల్పిస్తున్న సమయంలో దాదాపు పెద్ది సుదర్శన్ రెడ్డి శ్వాస కూడా ఆగుతున్న సమయంలో సి పి ఆర్ చేసి ప్రాణాలను కాపాడిన డాక్టర్ మమతను నేటిజెన్లతో పాటు నేతలకు కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు..
సికింద్రాబాద్ చేరుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంబులెన్స్
కాసేపట్లో యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స..