*ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.
ఈనెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం..
అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకొచ్చన్న వాతావరణశాఖ..
మేలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే చాన్స్
దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు పడే అవకాశం..
ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని..
కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్
ఈ ఏడాది మేలో పగటిపూట మాత్రమే కాకుండా..
రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుంది-ఐఎండీ..
ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్లో సముద్రపు తేమతో కూడిన వేడి గాలి వల్ల..
ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం-ఐఎండీ..
దేశంలోకి నిర్ణీత సమయం కంటే ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. మే 14 నుంచి 16వ తేదీ మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకవచ్చని వెల్లడించింది. దీని ప్రభావంతో మే నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు మరియు పశ్చిమ భారత దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే, ఈశాన్య రాష్ట్రాలు మరియు తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి..
మరోవైపు, తీరప్రాంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లలో వాతావరణం అసౌకర్యంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రపు తేమతో కూడిన వేడి గాలుల వల్ల ఈ ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. రుతుపవనాల కదలికలు ముందుగానే మొదలైనప్పటికీ, ప్రారంభ దశలో ఉష్ణోగ్రతలు మరియు తేమ కలయిక వల్ల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఐఎండీ నివేదిక స్పష్టం చేసింది.