11:46 నిమిషాలకు మోగిన అలారం.
– విపత్తు సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేందుకు సెల్ బ్రాడ్ కాస్ట్ ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
ఇది కేవలం ఒక పరీక్ష సందేశం మాత్రమే అంటూ స్పష్టం చేసిన భారత ప్రభుత్వం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత పౌరులకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక కోసం ఈ సేవను మొదలుపెట్టిన భారత ప్రభుత్వం ..
దేశ వ్యాప్తంగా ప్రజలను మొబైల్ ఫోన్లలో అలారంతో అలర్ట్ చేసింది కేంద్రం. దేశ వ్యాప్తంగా నిర్దిష్టంగా 11.46 నిమిషాలకు ఈ అలారం మోగింది. దేశం ఏదైనా విపత్తులో లేదా యుద్ధ సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేందుకు సెల్ బ్రాడ్ కాస్ట్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం . ఇది కేవలం ఒక టెస్ట్ పర్పస్ కోసం ఈ రోజు దేశ వ్యాప్తంగా అందరి మొబైల్స్ కు ఈ అలారంకు మోగేలా చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఏదైనా అనుకోని అవాంతరాలు ఎదురైపుడు భారత ప్రభుత్వం ప్రజల మొబైల్స్ కు ఇలాంటి హెచ్చరికలు పంపించడానికి ఇది ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా పంపడం ద్వారా ప్రజలు అప్రమత్తమయ్యేలా చేస్తారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత పౌరులకు తక్షణ విపత్తు నిర్వహణ హెచ్చరిక కోసం ఈ సేవను మొదలుపెట్టినట్టు భారత ప్రభుత్వం తెలిపింది. ఒకేసారి దేశ వ్యాప్తంగా లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం మోగింది. దీనికి సంబంధించిన ఒక రోజు ముందుగా కేంద్రం ఓ సందేశం పంపించింది. ఈ సైరన్ కు భయపడొద్దంటూ తెలిపింది..మే 2న) దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించనుందని కేంద్రం అలర్ట్ చేయడంతో ప్రజలు కూడా ముందుగానే మానసికంగా సిద్ధమయ్యారు. సరిగ్గా 11.46 నిమిషాలకు ఈ సైరన్ మోగింది. అయితే దీని గురించి ప్రజలు భయపడడం లేదా కంగారు పడాల్సిన అవసరం లేదని ముందే కేంద్ర ప్రభుత్వం తెలిపింది.*
భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తులు అంటే తుఫానులు, భూకంపాలు వరదలు, వంటివి వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి ప్రభుత్వం ‘సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం ను రెడీ చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ టెస్ట్ ను నిర్వహించాయి. దాదాపు దేశ వ్యాప్తంగా అన్ని సెల్ ఫోన్లు ఒకే సమయానికి సైరన్ మోత మోగాయి.
తాజాగా కేంద్రం మన దగ్గర ఉన్న మొబైల్కు ఒక మెసేజ్ పంపించింది. దాంతో పాటు పెద్ద సైరన్ శబ్దం కూడా వినిపించేలా ప్రజలను అలర్ట్ చేసింది.ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే అని చెప్పింది. భవిష్యత్తు ఏదైనా యుద్ధం లేదా విపత్తు సంభవించినపుడు ప్రజలను అప్రమత్తం చేయడానికే ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
ఈ సైరన్ వలన ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సమాచారం చేరవేయబడుతుంది. మరోవైపు వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తీవ్రంగా తగ్గించవచ్చు.ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ఫోన్లకు మాత్రమే ఈ మెసేజ్లు వెళ్లేలా ఈ టెక్నాలజీని రెడీ చేసిసట్టు తెలుస్తుంది.మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్న ఈ అలారమ్ పనిచేసేలా టెక్నాలజీని రూపొందించారు. .