స్కూటీ నీ ఢీ కొట్టిన ఏనుగు.. ఉత్తరాఖండ్‌లో విచిత్ర ప్రమాదం…!

స్కూటీ నీ ఢీ కొట్టిన ఏనుగు.. ఉత్తరాఖండ్‌లో విచిత్ర ప్రమాదం…!

Uttarakhand లోని ఖటీమా రోడ్డుపై జరిగిన ఓ విచిత్ర ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

స్కూటీపై వెళ్తున్న ఓ మహిళా టీచర్‌కు… అడవిలో నుంచి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఏనుగు ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే… ఏనుగు దంతం మూడు ముక్కలై నేలపై పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

ఘటనతో భయపడిన ఏనుగు వెంటనే తిరిగి అడవిలోకి పారిపోగా… గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం వార్త బయటకు రావడంతో… సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అయితే మరోవైపు… ఇది నవ్వుకునే విషయం కాదని, అడవి జంతువులు రోడ్లపైకి రావడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చెబుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.