కేటీఆర్ కు నోటీసులు, సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై దాడి కాంగ్రెస్ చేతగాని తనం…మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ పాలన తీరు, కేటీఆర్ కు నోటీసులు, సిరిసిల్ల క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని ఖండించిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

*జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమైంది..

అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తుంది..

అన్నీ శాఖలలో కమిషన్లే వాళ్ళ ఎజెండా..

ఏ మంత్రి ఎంత సంపాదించాలె.. సీఎం సీటు ఎట్లా పోటీపడాలె.. అన్న సోయి తప్ప మరొకటి లేదు..

అభివృద్ధి పక్కన పెట్టి దోచుకునే విషయంలో పోటీపడుతున్నరు..

ప్రశ్నిస్తున్న వాళ్లకు నోటీసులు ఇప్పించి బయపెట్టాలని చూస్తున్నారు..

ED లో రేవంత్ పేరున్నప్పటికి.. మోడీని కలవడానికి వెల్లాడంటేనే అర్ధమవుతుంది..

రేవంత్ బుద్ది.. రాష్టంలో బీజేపీ, కాంగ్రేస్ దోస్తీ ఎట్లుందో..

రేవంత్ చిల్లర చేష్టలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు..

అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసిండు..

KTR కు నోటీసులిస్తే బయపడతామనుకుంటున్నారా..

అనాడు KTR 8 గంటలు కూర్చుని స్వయంగా చెప్పిన విషయం మీకు గుర్తుకులేదా..

ప్రపంచ వ్యాప్తంగా KTR క్రేజ్ పెరుగుతుందనే ఏడుపు రేవంత్ ది..

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఇతర దేశాల ఆహ్వానం మేరకు వెళ్తున్నాడని తట్టుకోలేక పోతున్నారు..

వాటికీ హాజరుకాకుండా ఆపాలనే అక్కసుతోనే నోటీసులు..

నోటీసులతో చిల్లర డ్రామాలు చేస్తూ మరింత నవ్వుల పాలవుతున్నారు..

చిల్లర రాజకీయాలతో BRS కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయలేరు..

అభివృద్ధి సోయిలేదు.. 18 నెలలైన ఇంకా BRS మీద ఏడుపు తగ్గలేదు..

కెసిఆర్ కాళేశ్వరం ఎందుకు కట్టిండో కాంగ్రెస్ కు అవగాహన లేదు..

మన నీళ్లను చంద్రబాబు తీసుకెళ్తుంటే సోయలేదు..

చిల్లర చేష్టలు మానుకొని.. ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిది..

*సిరిసిల్ల ఘటన చిల్లర చేష్ట..*

ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత ఆఫీసర్ల పని..

KTR క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ చిల్లర మూకలకు ఏంపని..

KTR క్రేజ్ ఖండాతరాలకు వ్యాపించింది..

ఆ ఏడుపుతోనే KTR పై చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు

కాంగ్రేస్ పనికిమాలిన చర్యలతో మరింత అబాసుపాలు అవుతున్నది..

రేవంత్ బాసులనే తరిమికొట్టి తెలంగాణ తెచ్చినోళ్ళం..

అయన చిల్లర చేష్టలకు భయపడతామా..

తస్మాత్ జాగ్రత్త.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి..