ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీ లపై , పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..
ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీ లపై , జిల్లా లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి..
సోషల్ మీడియా లో పోస్టు లు పెడితే నే రోజులు తరబడి స్టేషన్ లో కూర్చోపెడుతున్నారు, చిన్నపాటి కాంగ్రెస్ నాయకుల హుకుం లకు ఐపీఎస్ స్థాయి వ్యక్తులు భయపడడం అంటే ఆత్మభిమానన్ని చంపుకోడమే . మీకు జీతాలు ఇస్తుంది కాంగ్రెస్ నాయకులు కాదు, ప్రజలు కట్టిన పన్నుల నుండి మీకు జీతాలు వస్తున్నాయి, ఇంతగా సాగిలబడి కాంగ్రెస్ నాయకులకు పని చెయ్యాల్సిన అవసరం లేదు
చిన్నపాటి కాంగ్రెస్ నాయకులు కింది స్థాయి పోలీస్ లను ఆఖరికి SI లను పట్టుకొని అరేయ్ తురేయి అని మాట్లాడుతున్నారు.జిల్లా లో అంతగా పోలీస్ వ్యవస్థ దిగజారింది. అది నియంత్రించలేని చేతకాని స్థితిలో ఇద్దరు ఎస్పి లు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు హుకుం జారి చేస్తే వేట కుక్కలాగా పరుగెడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఈ పద్ధతులు మార్చుకోవాలీ, మీరు ఆత్మాభిమానాన్ని చంపుకొని పని చెయ్యాల్సిన అవసరం లేదు, మీరు చేస్తుంది కరెక్టా కాదా అని మీ గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పండి.