గడ్డిపల్లి.
బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలి.
గడ్డిపల్లి గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని నిరసన తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాళ్లు రామలింగమ్మ గంగారపు సైదమ్మ లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి వారం రోజులు అవుతున్న నేటికీ అతన్ని అరెస్టు చేయకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఈ చర్యలతో చట్టం ఉన్నవాడికి చుట్టం అనేది తేటతెల్లమవుతుందని ఆమె తెలియజేశారు. ఆర్థిక బలం, అధికార బలం కలిగిన వారు తప్పు చేస్తే ఒక విధానం సామాన్యులు తప్పు చేస్తే మరొక విధానం అవలంబించడం సరైన విధానం కాదని అన్నారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని కానీతప్పు చేసిన తన కొడుకుని పోలీసులకు అప్పగించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడని తెలియజేశారు. అత్యాచారానికి గురైన కుటుంబంపై, కుటుంబ సభ్యులపై అనేక వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ నాయకురాళ్లు నాగమణి, సుశీల, వెంకటమ్మ,ఎల్లమ్మ, ఇందిరా,యల్లమ్మ, హసిత, ఎల్లమ్మ, వెంకటమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.