గరిడేపల్లిలో గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ…!

గరిడేపల్లిలో గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ.

గరిడేపల్లి:
గరిడేపల్లి ప్రాంతంలోని గ్రామీణ విద్యార్థుల కోసం గురుకుల, సైనిక్, వెల్ఫేర్ పాఠశాలల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తిగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ 2026 జనవరి 8 నుంచి ఫిబ్రవరి 20 వరకు గరిడేపల్లిలో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.
ప్రతిరోజూ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ ఉచిత శిక్షణలో గణితం, తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు మానసిక సామర్థ్యం (మెంటల్ అబిలిటీ) అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
శిక్షణలో చేరదలచిన విద్యార్థులు లేదా తల్లిదండ్రులు మరిన్ని వివరాలు మరియు నమోదు కోసం 9966395355 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959