బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం..!

పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వేళ ఎక్కువగా బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. మహిళలకు బంగారు ఆభరణాలు మరింత అందాన్ని ఇస్తాయని చెబుతుంటారు. అయితే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కొంత కాలంగా బంగారం, వెండి ధర లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది బంగారం ధర ఏకంగా 70 శాతం పెరగ్గా.. వెండి ధర 150 శాతం వరకు ఎగబాకింది. ఆ స్థాయిలో ఈ లోహాలకు డిమాండ్ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం జనవరిలో భారీగా పెరిగినా.. తర్వాత పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరిగి.. బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ధరలు ఉన్నట్లుండి పడిపోయాయి. సోమవారం ధరలు పెరగ్గా.. ఇవాళ తగ్గడంతో బంగారం ప్రియులు ఊరట చెందుతున్నారు. ఇక వెండి ధరలు కూడా డౌన్ అయ్యాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,890 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.490 పతనమయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,45,650 వద్ద ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.450 మేర పడిపోయాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి…

హైదరాబాద్ సిల్వర్ రేటు..
వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ రూ. 2.95 లక్షలుగా ఉంది. ఇక్కడ వరుసగా 4 రోజులుగా ధర మారకుండా స్థిరంగానే ఉంది. చివరిగా మే 21, 22 తేదీల్లో రూ. 5 వేల చొప్పున పెరిగింది.

ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల్ని గమనిస్తే ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4530 డాలర్లకు పడిపోయింది. కిందటి రోజు ఇది 4580 డాలర్ల స్థాయిలో ఉండేది. సిల్వర్ రేటు 76.70 డాలర్ల వద్ద ఉంది. క్రూడాయిల్ ధర పెరిగిన క్రమంలో.. రూపాయి విలువ మళ్లీ స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 95.42 వద్ద ఉంది.