దేశంలో నిన్న (గురువారం) బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతకుముందు రెండు రోజుల పాటు దిద్దుబాటుకు గురైన ధరలు పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి (Gold, Silver Prices on Feb 20).గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,500గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు రూ.2,230 మేర పెరిగింది. 22 క్యారెట్ 10 గ్రాముల ధర కూడా రూ.2,110 మేర పెరిగి రూ.1,43,460కు చేరుకుంది. ఇక నగరంలో వెండి ధర కూడా రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,70,100గా ఉంది.
నేడు విడుదల కానున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన సమావేశం తాలూకు వివరాల ప్రభావం ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న అమెరికా జీడీపీ నాలుగవ త్రైమాసిక ఫలితాలకు అనుగుణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి..
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో…
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయింది. ఇక కొన్ని నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాలు కూడా మంచివి ఉండటంతో బంగారం, వెండి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 2,100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,70,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
చెన్నై: ₹1,58,190; ₹1,45,010
ముంబై: ₹1,56,500; ₹1,43,460
న్యూఢిల్లీ: ₹1,56,650; ₹1,43,610
కోల్‌కతా: ₹1,56,500; ₹1,43,460
బెంగళూరు: ₹1,56,500; ₹1,43,460
హైదరాబాద్: ₹1,56,500; ₹1,43,460
విజయవాడ: ₹1,56,500; ₹1,43,460
కేరళ: ₹1,56,500; ₹1,43,460
పుణె: ₹1,56,500; ₹1,43,460
వడోదరా: ₹1,56,550; ₹1,43,510
అహ్మదాబాద్: ₹1,56,550; ₹1,43,510
వెండి (కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,70,200
ముంబై: ₹2,70,100
ఢిల్లీ: ₹2,70,110
కోల్‌కతా: ₹2,70,100
బెంగళూరు: ₹2,70,100
హైదరాబాద్: ₹2,70,100
విజయవాడ: ₹2,70,100
కేరళ: ₹2,70,000
పుణె: ₹2,70,100
వడోదరా: ₹2,70,000
అహ్మదాబాద్: ₹2,70,100