రూ.10 కోట్ల విలువైన హాల్‌మార్క్‌ లేని ఆభరణాల స్వాధీనం.. వరంగల్‌లో తనిఖీల్లో దొరికిన నగలు..

రూ.10 కోట్ల విలువైన హాల్‌మార్క్‌ లేని ఆభరణాల స్వాధీనం..

వరంగల్‌లో తనిఖీల్లో దొరికిన నగలు..

హాల్‌మార్క్‌ ధ్రువీకరణ లేని బంగారు ఆభరణాలు..

నాణ్యత, స్వచ్ఛత ప్రమాణాలు పాటించకుండా బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదుతో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) విభాగం అధికారులు వరంగల్‌లోని బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. నాణ్యత ప్రమాణాన్ని ధ్రువీకరించే హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిటీ నంబరు(హెచ్‌యూఐడీ) ముద్రణ లేకుండా ఓ దుకాణంలో ఆభరణాలు విక్రయించడాన్ని అధికారులు గుర్తించారు. ఈ దుకాణంలో మంగళవారం నాలుగు గంటలు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.10 కోట్లకు పైగా విలువైన 7.875 కిలోల బంగారు ఆభరణాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. బీఐఎస్‌ కేర్‌ యాప్‌నకు అందిన ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు.