ఇటీవల నెల రోజులుగా బంగారం ధరలు పడిపోతూనే ఉన్నాయి. ఇది మనకు తెలుసు. ఇంకా పడిపోయే ఛాన్స్ కూడా ఉందని మనకు తెలుసు. ఐతే.. బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి మాత్రం ఒక దేశం షాక్ ఇస్తోంది. అదే టర్కీ. దాన్ని ఈమధ్య తుర్కియే అని కూడా పిలుస్తున్నారు. ఆ మధ్య భూకంపం వచ్చినప్పుడు.. భారత్, ఈ దేశానికి మందులు, ఆహారం సప్లై చేసింది. కానీ ఈ దేశం ఏం చేసింది? ఆమధ్య మన భారత ఆర్మీ.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించినప్పుడు.. ఈ టర్కీయే.. పాకిస్థాన్కి అండగా నిలబడి.. ఆయుధాలు కూడా ఇచ్చింది. సరే.. అది గతం. ఇప్పుడు ఈ దేశం బంగారాన్ని అమ్మేస్తోంది. అది కూడా భారీగా. ప్రపంచం షాకయ్యేలా ధరలు ఉంటున్నయి..ఇండియాలో బంగారం ధరలను.. ప్రపంచ బంగారం ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి.. ప్రపంచంలో బంగారం ధరలు పెరిగితే.. ఇండియాలో కూడా పెరుగుతాయి. ప్రపంచంలో తగ్గితే, భారత్ లోనూ తగ్గుతాయి. ఈ కారణంగా ఇప్పుడు భారతీయులకు బంగారం ధరలు బాగా తగ్గాయి. “కొనుగోళ్లకు ఇదే సరైన టైమ్” అని హైదరాబాద్ లోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని అభిప్రాయపడ్డారు. ఐతే.. బ్లూమ్బెర్గ్ అంచనాలు మరోలా ఉన్నాయి. బంగారం ధరలు మరికొన్నాళ్లపాటూ ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 20 తర్వాత బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయి అనేది తాజా అంచనా. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,090 ఉండగా.. 23 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ. 1,35,750 ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.