గోపాలపురం వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి.

*సూర్యాపేట జిల్లా….*

హుజూర్ నగర్ మండలం గోపాలపురం సమీపంలో. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి…

గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన నెంబరబోయిన దుర్గారావు (26), శీలం ఉపేందర్ (24) లు గుర్తింపు..

హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సమీప బంధువులను పరామర్షించి తిరిగి వెళుతుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ ని బైక్ తో బలంగా ఢీకొట్టడంతో… వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కి సమాచారం అందించి ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలో మృతి చెందినట్లుగా సమాచారం…

మృతదేహాలని హుజూర్నగర్ లోని ఏరియా ఆసుపత్రి తరలించడం జరిగింది.. ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..