ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి టాప్ మార్కులు సాధించిన 9 మంది విద్యార్థిని విద్యార్థులకు శనివారం సన్మానం నిర్వహిస్తున్నట్లు ఎన్నారై ఫౌండేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు బోనాల రామకృష్ణ,బండి నాగేశ్వరరావు తెలిపినారు. స్థానిక వైరా రోడ్డులోని కృషి భవన్ వద్ద ఉన్న ఎన్నారై ఫౌండేషన్ జిల్లా కార్యాలయంలో 9 మంది విద్యార్థులకు నగదు పారిషోతకం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మరియు జిల్లా విద్యా శాఖాధికారి సామినేని సత్యనారాయణ చేతుల మీదగా అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.ఖమ్మం జిల్లా జలగం నగర్ జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 581 మార్కులు సాధించిన వచ్చావా వెన్నెలకి, మొదటి బహుమతి, మరియు రెండో బహుమతి మధిర ప్రభుత్వ పాఠశాల నుంచి 577 మార్కులు సాధించిన యాగం యశ్వంత్ కి,577 మార్కులు సాధించిన చించోజు సాయి,572 మార్కులు సాధించిన తిరుమలదాసు, ఖమ్మం కాజీపుర హైస్కూల్ కు చెందిన 569 మార్కులు సాధించిన రామిశెట్టి ఉమామహేశ్వరి,569 మార్కులు సాధించిన అవుల శ్రీమన్య,565 మార్కులు సాధించిన చందా భావనలకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చేతుల మీదగా టాప్ ర్యాంకర్ కి నగదు బహుమతి సన్మానం చేయడం జరిగింది. అదే విధంగా ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత యోగ శిక్షణ తరగతులు మరియు వారికి ఆహార నియమాలు దినచర్య,ఋతు చర్య గురించి జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడానికి, ఏకాగ్రత కోసం, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కొరకు, చక్కని క్రమశిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శ్రద్ధ శ్రీ యోగాచార్యులు షేక్ బహార్ అలీ ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రత్యేకంగా సన్మానం చేయడం జరిగినది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.