చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్థాయికి తగ్గట్టుగా రాణించింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81), దేవ్‌దత్ పడిక్కళ్ (27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55) తుఫాన్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో ఆర్సీబీ నెగ్గింది. ఈ గెలుపుతో పట్టికలో 10 పాయింట్లతో టాప్-2కి చేరింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100) శతకంతో సత్తా చాటగా.. సారథి గిల్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), హోల్డర్ (10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 23 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో బెంగళూరు 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసి గెలిచింది. క్రునాల్ పాండ్యా (12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 23 నాటౌట్) చివర్లో వేగం చూపాడు. రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా విరాట్ కోహ్లీ నిలిచాడు..
క్యాచ్ వదిలిన సుందర్….!
భారీ ఛేదనలో సిరాజ్ ఆదిలోనే ఆర్సీబీకి షాకిచ్చాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుందర్ నేలపాలు చేశాడు. అయినా షారుక్ ఖాన్ క్యాచ్‌తో 24 పరుగులకే ఆర్సీబీ తొలి వికెట్ పడింది. జాకబ్ బెథెల్ (14) సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బెథెల్ వికెట్ పడినా దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు.. దూకుడుగా ఆడి పవర్ ప్లేలో 50 స్కోర్ దాటించారు. ఇద్దరూ అర్ధ శతకాలతో ఆర్సీబీ విజయానికి బాటలు వేశారు. వీరిద్దరి జోరు చూస్తే అజేయంగా గెలిపిస్తారనిపించింది. కానీ, రషీద్ ఖాన్ 13వ ఓవర్లో పడిక్కల్ ఔటవ్వగా.. హోలర్డ్ బౌలింగ్‌లో వరసగా రెండు సిక్సర్లతో బెంగళూరు స్కోర్ 150 దాటించిన కోహ్లీ ఆ తర్వాత బంతికే వెనుదిరిగాడు.