చంపక్ అనే రోబోట్ డాగ్‌తో ధోనీ ఆడుకుంటు..!

ఐపీఎల్ 2026లో ఎల్-క్లాసికోగా పిలవబడే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోరుకు రంగం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్ కంటే ముందే ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక క్రేజీ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ.. ప్రాక్టీస్ సెషన్‌లో ఒక రోబోట్ కుక్కతో సరదాగా గడిపిన దృశ్యాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌తో జరిగే భారీ పోరుకు ముందు ధోనీ తనలోని సరదా కోణాన్ని బయటపెట్టారు. చంపక్ అనే రోబోట్ డాగ్‌తో ధోనీ ఆడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ధోనీ నేలపై పడుకుని రోబోట్ కుక్క చేసే విన్యాసాలను అనుకరిస్తూ వ్యాయామం చేయడం కనిపిస్తోంది. అయితే, సరదాగా సాగుతున్న ఈ సమయంలో ధోనీ ఒక్కసారిగా వెనుకకు వెళ్లే క్రమంలో కాస్త గట్టిగా జారిపడ్డారు. ఇది చూసిన అభిమానులు ఆయన గాయం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ధోనీ మాత్రం చిరునవ్వుతో దానిని తేలికగా తీసుకున్నారు..