సుప్రీంకోర్టు లాయర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) కు మధ్య వాగ్వాదం కలకలం రేపింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు..ఐలాపూర్లో (Ilapur) ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో రంగనాథ్ సమావేశం అయ్యారు. ఈ క్రమంలో ఐలాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా.. మీరెలా వస్తారు, మీకు తెలుగు వచ్చా? అని హైడ్రా కమిషనర్ను ఐలాపూర్ గ్రామవాసి, సుప్రీంకోర్టు న్యాయవాది (Supreme Court Lawyer) ముఖిమ్ ప్రశ్నించారు.
దీంతో మీరు చెప్పేది చెప్పండి ఓవరాక్షన్ చేయొద్దంటూ లాయర్పై హైడ్రా కమిషనర్ ఫైర్ అయ్యారు. అమాయకులను రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తే ఊరుకోబోమని రంగనాథ్ హెచ్చరించారు. న్యాయవాది ముఖిమ్కు నచ్చచెప్పడానికి పోలీసులు ప్రయత్నించగా వాగ్వాదం జరింగింది. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న రంగనాథ్.. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పని చేస్తోందని అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జాచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.