కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కొనసాగిన విచారణలో కమిషన్ హరీశ్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. సుమారు 45 నిమిషాల పాటు ఈ విచారణ సాగింది…కమిషన్ ఎదుట మొదట ప్రమాణం చేసిన తర్వాత.. తాను తెలుగు మీడియం స్టూడెంట్ ను కాబట్టి పూర్తిస్థాయిలో ఇంగ్లీషును మాట్లాడలేనని.. అర్థం చేసుకోగలనని కమిషన్ కు హరీష్ రావు చెప్పారు.దీంతో ఈ అంశాన్ని జడ్జి పరిగణలో తీసుకొని ఇంగ్లీష్ ఇబ్బంది అయితే హిందీలో చెప్పవచ్చు.. లేదా తెలుగులో చెప్పిన తనకు ట్రాన్స్ లేట్ చేసేవారు ఉన్నారని తెలిపారు. అయితే, కమిషన్ విచారణలో భాగంగా కొన్ని సందర్భాల్లో జడ్జి అడిగిన ప్రశ్నలను హరీశ్ రావు అర్థం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా టెక్నికల్ అంశాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు అది అధికారులు చూసుకున్నారని మాత్రమే హరీశ్ రావు సమాధానం ఇచ్చారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.