నా ఇల్లు పెడితే మంత్రి ఉంటడా అంటున్నవ్‌. మరి ప్రజల భూములు పెట్టిన నువ్‌ ఉంటవా? నీ ప్రభుత్వం ఉంటదా? ఆలోచించుకో.. మాజీ మంత్రి హరీష్ రావు.

22Aళ విషయంలో తప్పు జరిగింది నిజం… పొంగులేటి క్షమాపణలు చెప్పింది నిజం.
టోల్‌ ఫ్రీ నంబర్‌ పెట్టింది నిజం. అయినా ఉల్టా దబాయిస్తవు. నా ఇల్లు పెడితే మంత్రి ఉంటడా అంటున్నవ్‌. మరి ప్రజల భూములు పెట్టిన నువ్‌ ఉంటవా? నీ ప్రభుత్వం ఉంటదా? ఆలోచించుకో..

రాత్రికి రాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చిండ్రని ప్రజలే గగ్గోలు పెడుతున్నరు. బీఆర్‌ఎస్‌ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ల సమస్య వస్తే నేను ముక్కునేలకు రాస్త.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాకే సమస్య వచ్చిందని ప్రజలు చెప్తే నువ్వు రాస్తవా? రేవంత్‌రెడ్డీ?

తెలంగాణలో భూ భారతి పేరుతో జరుగుతున్న భూ కుంభకోణాలు, రైతులు.. సామాన్యుల భూములతో చెలగాటమాడుతున్న 22ఏ, సీఎం సోదరుల భూ కుంభ కోణాలపై ఎలాంటి తప్పులు జరుగకపోతే రేవంత్‌ సర్కార్‌ ఎందుకు భయపడుతున్నది? ప్రభుత్వం తప్పు చేయకుంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ముందుకు రావాలి.

22ఏ నుంచి నీ ఇల్లు మాత్రం తీసుకున్నవ్‌. దానికి ఏ హై పవర్‌ కమిటీ లేదు. లీగల్‌గా ఆలోచించేది లేదు. నీ ఇల్లు ఎట్లా తీసుకున్నవో? ప్రజల ఇండ్లు కూడా అట్లా ఎందుకు తీయవు? మీ చర్చ ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా? ప్రజలకు రిలీఫ్‌ దొరికిందా అని అన్నారు..అందుకు తీసుకున్న సగటు సమయం 26 నిమిషాలు. 24,22,874 పార్టీషన్‌ డీడ్స్‌ జరిగితే సగటు సమయం 31 నిమిషాలు. పెండింగ్‌ మ్యుటేషన్లలో 1,79,216 మ్యుటేషన్లకు తీసుకున్న సమయం 32 నిమిషాలు. 95,676 నాలా కన్వర్షన్లకు తీసుకున్న సమయం 28 నిమిషాలు’ అని హరీశ్‌రావు వివరించారు. అంత చకగా కొన్ని గంటల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, నాలా కన్వర్షన్లు లక్షల మందికి జరిగితే.. ఎకడో ఒకటో రెండో చిన్న పొరపాట్లను సరిదిద్దాల్సిన ప్రభుత్వం.. అలా చేయకుండా చాలెంజ్‌ స్కామ్‌కు వేదికైన భూభారతిని తెచ్చిందన్నారు. ‘భూ భారతి ద్వారా ప్రజలకు తెలియకుండా ప్రజల ఆస్తులను బదిలీ చేశారు. ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చారు. వీటి మీద చర్చ చేయరా? దాని మీద విచారణకు ప్రభుత్వం ముందుకు రాదు?’ అని హరీశ్‌రావు నిలదీశారు.

భూ కుంభకోణాలపై నీ సమాధానం ఏది?
‘భూభారతిలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలను తెలంగాణభవన్‌ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన ఒక్కొక్కటిగా బయటపెట్టాం. నువ్వు మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు కానీ, మేము లేవనెత్తిన, ప్రశ్నించిన ఒక కుంభకోణం మీదనైనా ప్రభుత్వం సమాధానం చెప్పిందా?’ అని హరీశ్‌రావు నిలదీశారు.

‘నాదర్‌గుల్‌లో 373 ఎకరాల భూ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలు సహా బీఆర్‌ఎస్‌ బయటపెట్టింది.

అది ప్రభుత్వ భూమి అని ఆర్డీవో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేస్తాడు. ప్రభుత్వ భూమి అని నిషేధిత జాబితాలో రెవెన్యూ రికార్డులో ఉంటది. భూమేమో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంది. హైడ్రా కండ్లు మూసుకుంటది. ఆర్డీవో నిద్రపోతుంటడు. రూ.10,000 కోట్ల విలువైన నాదర్‌గుల్‌ భూముల సామ్‌ను బీఆర్‌ఎస్‌ బయటపెట్టినా ఎందుకు అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు?’ అని హరీశ్‌ మండిపడ్డారు..కమిటీలు, పాలసీలతో కాలయాపన
‘సింగరేణికి జిల్లా స్థాయిలో కమిటీ ఎందుకు? ఇప్పటికే జీవో-76 ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు. ‘జీవో-118, ఎల్‌ఆర్‌ఎస్‌, సింగరేణి, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ భూములు, అసైన్డ్‌ భూములు నాలాలు, ఇందిరమ్మ ఇండ్లు, భూదాన్‌ భూములు అంటూ.. వాటిని పరిశీలిస్తాం, హై లెవల్‌ కమిటీ వేస్తాం. ఆలోచిస్తాం. లీగల్‌గా పరిషరిస్తాం. విసృ్తత స్థాయిలో సంప్రదింపులు జరుపుతాం. ఫీజులు కట్టించుకుంటాం. గైడ్‌లైన్స్‌ ఇస్తామని చెప్పడం తప్ప.. ప్రజలకు ఉపయోగపడేది ఏదీ చెప్పలేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ’22ఏ నుంచి నీ ఇల్లు మాత్రం తీసుకున్నావు. నీ ఇంటికి ఏ హై పవర్‌ కమిటీ లేదు. లీగల్‌గా ఆలోచించేది లేదు. కమిటీ వేసేది లేదు. పరిషరించేది లేదు’ అని హరీశ్వ్రు ఎద్దేవా చేశారు. ‘నీ ఇల్లు ఎట్లా తీసుకున్నావో? ప్రజల ఇండ్లు కూడా అట్లా ఎందుకు తీయవు? ఈ చర్చ ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా? ప్రజలకు రిలీఫ్‌ దొరికిందా? ఉత్తమాటలు చెప్పి, ఎదురుదాడి తప్ప.. సమస్య నుంచి తప్పించుకొనే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేసిండు’ అంటూ తీవ్రస్థాయిలో హరీశ్‌రావు మండిపడ్డారు.