చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే రకం రేవంత్ చచ్చే వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా-హరీష్‌రావు.

ఈటల రాజేందర్ వేరే పార్టీ.. నేను వేరే పార్టీ

ఈటెల రాజేందర్‌కు నాకు ఏం సంబంధం-హరీష్‌.

చొక్కాలు మార్చినట్టు పార్టీలు మార్చే రకం రేవంత్
చచ్చే వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా-హరీష్‌రావు.

ఇదే విషయం 100 సార్లు చెప్పా-హరీష్‌రావు.

రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్
RR టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానియే చెప్పారు.

ఫైనాన్స్‌ బిల్లులో 12శాతం తీసుకుంటున్నారు
కేంద్రం ఎందుకు విచారణ జరపడంలేదు-హరీష్‌
BRS తరపున పోరాటం మరింత ఉదృతం చేస్తాం-హరీష్‌రావు
..

రైతుల పంట పొలాల్లో నీళ్లు పారించండి ముఖ్యమంత్రి అంటే మా రక్తాన్ని పారిస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన బాధ్యతేనా..? అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌ రావు మాట్లాడుతూ.. నీళ్లు కావాలని మేం అడిగితే రక్తం కావాలె అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడు. సరే నీకు రక్తం కావాలంటే కూడా ఇస్తం.. మేమేం వెనుకాడేటోళ్లం కాదు.. నీకు నీళ్లివ్వడానికి అడ్డమైతే మేం రక్తం ఇవ్వడానికి కూడా మేం సిద్దంగా ఉన్నామన్నారు. సీఎం రేవంత్‌ భాష శాడిస్ట్‌ మాట్లాడే భాషలా ఉన్నాయన్నారు…సీఎం మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తున్నారు. పొలాల్లో నీళ్లు పారించమంటే బూతులు పారిస్తున్నారు. నిన్న బోధి పెవీలియన్‌లో మాట్లాడిండు.. పేరేమో బోధి పెవీలియన్‌.. మాటలేమో హింసను ప్రేరేపించి హింసను తలపించే మాటలు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఆ మధ్య హిట్లర్‌ తనకు ఆదర్శం అన్నాడు. అందుకే హిట్లర్ తరహాలు ఒక హంతక భాష మాట్లాడుతున్నడు. కానీ ఒకటి మాత్రం నిజం.. ఫైనల్‌గా పాపం పండిన్నాడు హిట్లర్‌కు ఏ గతి పట్టిందో రేవంత్‌ రెడ్డి నీకు కూడా అదే గతి పడ్తదని హెచ్చరించారు. …