హర్యానాలో భూకంపం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం…!

హర్యానాలో భూకంపం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం…
హర్యానాలోని ఫరీదాబాద్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.2గా నమోదైంది. జూలై 22న ఉదయం 6:08 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ఉత్పన్నమయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం కారణంగా నిద్రలోంచి పూర్తిగా మేల్కొక ముందే అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.