భారీ వర్షాలు ఉత్తరాదీ రాష్ట్రాల్లో బీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో భారీ వర్షాల కారణంగా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. కొండచరియలు విరిగిపడటం వల్ల పలు రహదారులను బ్లాక్ చేశారు. అలాగే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కరిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
300 రోడ్లు రాకపోకలకు ఆటంకం….
హిమాచల్ ప్రదేశ్ అత్యవసర విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాలు ప్రకారం జులై 31 ఉదయం 10 గంటలకు నాటికి మొత్తం 301 రహదారులు ఇప్పటికే బ్లాక్ చేశారు. 436 విద్యుత్ పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. 254 నీటి సరఫరా పథకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక జూన్ 20న మొదలైన వర్షాల కారణంగా మొత్తం 170మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు , క్లౌడ్ బస్టర్, విద్యుదాఘాతం వంటి ఘటనల కారణంగా 94 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో 76 మంది మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు కేంద్రం తెలిపింది..