రిటైన్ అడ్వకేట్ లుగా స్టేట్ లీగల్ సర్వీస్ ఆధారిటీ వారిచే నామినేట్ అయినా అడ్వకేట్ లకు సన్మానం..
సూర్యాపేట జిల్లా: హుజుర్ నగర్..
హుజూర్నగర్ కోర్టులో రిటైన్ లాయర్లుగా ఎంపిక కాబడిన *బి.నాగేశ్వరరావు (నగేష్ రాథోడ్),
షేక్ సైదా హుస్సేన్, రమావత్ అడవి రాముడు* లను బార్ అసోసియేషన్ *వైస్ ప్రెసిడెంట్ జక్కుల వీరయ్య* ఆధ్వర్యంలో శాలువా లు, పూలమాలలతో ఘనంగా సన్మానించి నారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ *వైస్ ప్రెసిడెంట్ జక్కుల వీరయ్య మాట్లాడుతూ న్యాయమూర్తులకు, కక్షి దారులకు రిటైన్ లాయర్లు అందుబాటులో ఉండి వారి సేవలను పూర్తిస్థాయిలో పేదరికం లో ఉన్న కక్షి దారులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భవిష్యత్తులో వీరు మంచి స్థానంలో ఉండాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు .
. ఈ కార్యక్రమంలో *లైబ్రరీ సెక్రటరీ ధూళిపాల శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బుడిగ నరేష్, షేక్ నాగపాషా, భూక్య నాగరాజు నాయక్, సీనియర్ న్యాయవాదులు, ఏ జి పి బానోత్ సురేష్ కుమార్, కుక్కడపు నరసింహారావు, మీసాల అంజయ్య, పిన్నపురెడ్డి వెంకట్ రెడ్డి , చనగాని మహేష్, పసుపులేటి వీరు* తదితరులు పాల్గొన్నారు.