రేకుల గదికి రూ.1.27 కోట్ల విద్యుత్ బిల్లు.!

రేకుల గదికి రూ.1.27 కోట్ల విద్యుత్ బిల్లు.

సూర్యాపేట జిల్లా…

పాలకవీడు మండలంలోని కొత్త తండాలో ఓ కుటుంబం సభ్యులకు విద్యుత్ బిల్లు చూసి శాఖ ఎలా చేసింది..

తండాకు చెందిన రమావత్ రాణికి ఇల్లు ఉంది. ఆ ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు ఉన్నాయి. మే నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లును ఆపరేటర్ గురువారం రీడింగ్ తీశాడు.

ప్రతినెలా మాదిరిగానే గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లు వచ్చిందని కుటుంబసభ్యులు అనుకున్నారు. ఏకంగా రూ.1,27,79,408 విద్యుత్ బిల్లు రావడంతో ఇంటి యజమాని ఒక్కసారిగా అవాక్కయ్యారు.

సాధారణ కుటుంబానికి వచ్చిన బిల్లు చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.

పొరపాటున బిల్లు తప్పు పడిందని ఉన్నతాధికారులను బిల్లుని సరిచేసి 110 రూపాయలు విద్యుత్ బిల్లు ఆ గృహానికి ఇచ్చారు….