నేటి ప్రధాన అంశాలు..

*🔹నేటి నుంచి తెలంగాణలో భూముల ధరలు పెంపు*
_• ప్రాంతాలవారీగా భూముల విలువ 50-100 శాతం పెంపు_
_• ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువ 100%పెంపు._
_• ప్రభుత్వానికి రూ.1200-రూ.1400 కోట్ల ఆదాయం._
_• రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే ఆలోచనలేదన్న పొంగులేటి._

*🔹రెండోరోజు పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన.*
_• నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పరిశీలన._
_• ఉద్దండాపూర్‌లో సీఎం రేవంత్ బహిరంగ సభ._

*🔹నేటి నుంచి తెలంగాణలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.*
_• ఈ నెల 12 వరకు జరగనున్న టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు._
_• పరీక్షలు రాయనున్న 31,542 మంది విద్యార్థులు._

*🔹నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు*
_• కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిరసనలు._

*🔹నేడు విశాఖలో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన.*
_• విశాఖకు పీయూష్‌ గోయల్, రాజీవ్‌ రంజన్‌ సింగ్._
_• జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల వర్క్‌షాప్‌._
_• వర్క్‌షాప్‌కు హాజరుకానున్న పీయూష్‌, రాజీవ్‌రంజన్._

*🔹నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.*
_• నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.._
_• విశాఖలో 4 కి.మీటర్లు సైకిల్‌ తొక్కనున్న చంద్రబాబు._
_• సముద్రఆహార ఎగుమతుల వర్క్‌షాప్‌లో పాల్గొననున్న సీఎం మధ్యాహ్నం విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశం._

*🔹నేడు తమిళనాడు నేత అన్నామలై కీలక ప్రకటన*
_• సోషల్ మీడియా ద్వారా ఆలోచనలు పంచుకోనున్న అన్నామలై._

*🔹నేడు అస్సాం కేబినెట్ విస్తరణ. 9 నుంచి 12 మంది ప్రమాణస్వీకారం చేసే అవకాశం.*

*🔹తెలంగాణలో నేటి నుంచి డాక్టర్ల సమ్మె..OP సేవలు బంద్.*

_• తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ కీలక ప్రకటన_
_• ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు బంద్._
_• తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు వైద్యుల పిలుపు._
_• నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారని ఆరోపణ._
_• జీవో 38ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్‌._

*🔹నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష కీలక వడ్డీ రేట్లను ప్రకటించనున్న ఆర్బీఐ.*

*🔹అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు పొడిగింపు*
_• తీవ్ర ఎండల దృష్ట్యా ఈనెల 13 వరకు సెలవులు పొడిగింపు._

*🔹ఎన్టీఆర్: మూలపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌*
_• బటర్ ఫ్లై పార్క్‌ను సందర్శించనున్న పవన్_

*🔹కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం భారీ వర్షానికి నీట మునిగిన ధాన్యం బస్తాలు.*
_• కొట్టుకుపోయిన ఆరబెట్టిన ధాన్యం, తీవ్రంగా నష్టపోయిన రైతులు_
_• తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి._