మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ..హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు..
మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, ..హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు..
మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఇటీవల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా.. మరియు ఈనెల 18న పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా…
ఈరోజు హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు.. ఈ సందర్భంగా ఈనెల 29న జరగనున్న హుజూర్నగర్ బీఆర్ఎస్ నాయకులు డా. KLN రెడ్డి మనవరాలు నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా..మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారితో… హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన విధి, విధానాలను వివరించడం జరిగింది. కష్ట కాలంలో పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు ఉంటాయని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు నియోజకవర్గంలో ఓటర్ల జాబిత ప్రత్యేక సమగ్ర సవరణ, సర్ SIR ప్రక్రియ, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టి బూత్ లెవెల్ ఏజెంట్స్ BLA లను సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వివరించారు అంతేకాకుండా పట్టణాల్లో మరియు గ్రామాల్లో బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ల సమాచారం నింపి అందించిన ఎన్యూమరేషన్ ఫారంలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేసేలా అధికారులను సంప్రదించాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో … హుజుర్నగర్ మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కె ఎల్ ఎన్ రెడ్డి నేరేడుచర్ల మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు, పాలకీడు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు క్రిష్టిపాటి అంజిరెడ్డి, హుజూర్నగర్ బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి చెన్న బోయిన సైదులు మరియు బిఆర్ఎస్ నాయకులు ఎల్లబోయిన లింగయ్య, షేక్ అలీ గువ్వల వీరన్న, పసుపులేటి సైదులు, బానోతు రామారావు, మల్లెపల్లి నరసింహారావు సుదర్శన్ గురవయ్య, అశోక్ సకృనాయక్,సతీష్ తదితరులు ఉన్నారు.