*యుక్త వయస్సు బాలికల ఆరోగ్య అవగాహన సదస్సు*
*ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలి*
*గైనకాలజిస్ట్ డాక్టర్ గంపల శిరీష*
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అధ్యాపకుల ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల ఆవరణలో యుక్త వయసులో బాలికలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గైనకాలజిస్ట్ డాక్టర్ గంపల శిరీష విచ్చేసి యుక్త వయసులో బాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ముందస్తు జాగ్రత్తల గురించి చక్కగా వివరించారు. విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు వారికి అర్ధమయ్యే విధంగా వివరించారు. ఈ సందర్బంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు జయప్రద మాట్లాడుతూ విద్యార్థులు తమకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వాటి పరిష్కారాలను తెలుసుకోడానికి తమ ఉపాధ్యాయుల సహకారంతో ఉచిత అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గైనకాలజిస్ట్ డాక్టర్ గంపల శిరీషకు కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, ఆర్ విజయ, షబానా, మాధవి, కరుణ,అపర్ణ జీవన,రామనరసమ్మ, కమలమ్మ, విజయలక్ష్మి ,జానీ బేగం,వనజ,పీడీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.