అమ్మమ్మ ఇంటికి వెళ్ళి నీళ్ల ట్యాంక్లో శవమై తేలిన బాలిక
హైదరాబాద్ పాతబస్తీ మదన్నపేట్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన 7 ఏళ్ల బాలిక హుమేయాని సుమయ్య మంగళవారం కనిపించకుండా పోగా, బుధవారం ఇంటి పైన నీటి ట్యాంక్లో శవమై తేలింది. చేతులు, కాళ్లు కట్టిన స్థితిలో ఉండటంతో హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేగగా, పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు….
. అయితే.. ఆమెను హత్య చేసి.. నీళ్ల ట్యాంకులో వేయడం కలకలం రేపింది. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక హుమేయాని సుమ్మయ్య తల్లితో పాటు మాదన్నపేట్ చావనిలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది.. మంగళవారం సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. అంతటా వెతికిన కుటుంబసభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..