వాహనాలతో కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి..!

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో పట్నం నుండి పల్లెలకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోతుంది, ఆదివారం ఉదయం నుండే చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం అర్ధరాత్రి నుండి వాహనాల రద్దీ కొనసాగుతుంది. జాతీయ రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ జామ్ నెలకొనకుండా ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు..