*సూర్యాపేట జిల్లా..*
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
*జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..*
22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారంటీల జాడే లేదు..
అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నాం..
ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు ..
రైతు రుణమాఫీ డిసెంబర్ 9 లోపే చేస్తామని చెప్పిండ్రు..
హామీలే కాదు ఇంటింటికి గ్యారెంటీ కార్డు కూడా స్వయంగా వాళ్లే పంచిండ్రు..
గ్యారెంటీ కార్డులను దగ్గర పెట్టుకొని రాకుంటే మాకు గుర్తు చేయమని ఆనాడే చెప్పిండ్రు..
గ్యారెంటీ కార్డులు ఇచ్చి 22 నెలలు పూర్తయిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు..
వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీ కార్డుల ప్రకారమే ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నారో తెలిసేలా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు రూపంలో అందిస్తున్నాం..
రూ. 50వేల కోట్లు రుణమాఫీ చేస్తామని 20 వేల కోట్లు చేశామని చెప్పారు..
అందులో కూడా రూ. 17000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు..
రైతుబంధు కాదు రైతు భరోసా అని చెప్పిన ప్రకారం ఒక్కో ఎకరానికి రూ. 19 వేల బాకీ ఉంది..
మహిళలకు 2500 రూపాయలు మొదటి నెల నుంచే ప్రారంభిస్తామని చెప్పి.. ఒక్కో మహిళకు 55 వేల రూపాయలు బాకీ ఉంది..
మొత్తం ఆసరా పెన్షన్ లు ప్రతి ఒక్కరికి 44 వేల రూపాయలు బాకీ ఉంది..
ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిన వాళ్లకు కలిపితే రూ. 88 వేలు బాకీ ఉన్నట్టే..
వికలాంగులకు కూడా ఒక్కొక్కరికి 44 వేల రూపాయలు బాకీ ఉంది..
ఆటో కార్మికులకు ఏడాదికి 12 వేలు అని చెప్పిన ప్రకారం 22,000 బాకీ ఉంది..
2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 5000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు..
గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి 12,000 అని చెప్పారు వాళ్లకు కూడా 24000 బాకీ ఉంది..
ఇచ్చిన ఒక్క గ్రూపు1 లో కూడా మొత్తం ఫైరవీలు చేసి కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యోగాలను ఆంద్రోళ్లకు కట్టబెట్టిండ్రు..
ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా మోసం చేసిండ్రు..
విద్యార్థులకు 5 లక్షల భద్రత కార్డులు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసిండ్రు..
ఈ హామీలన్నీ కూడా రేవంత్ మాత్రమే కాదు.. సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కార్గే లు చెప్పినవే..
ప్రభుత్వ ఉద్యోగులనే కాదు ఔట్సోర్సింగ్ ఉద్యోగలను కూడా దారుణంగా మోసం చేసిండు..
ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారు..
కాంగ్రెస్ చోటామోటా నాయకులు ఫోన్ చేసినా పోలీసులు కేసులు పెట్టే పనిలో ఉన్నారు..
సినిమాకు పోయి తొక్కేసలాటలో చనిపోతే ఎంతో పెద్ద హడావిడి చేసిన ప్రభుత్వం..
యూరియాలో ఉన్న నిలబడి మహిళా రైతు చనిపోతే పరామర్శించిన పాపాన పోలేదు..
రైతుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా..
ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారో చూద్దాం..
ఎన్నికలని ఇండ్ల ముందుకు వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయండి..
సూర్యాపేట ఉండ్రుగొండలో ఇంటింటికి తిరిగి కార్డులు పంచినం..
కార్డులు పంచుతున్న సమయంలో కాంగ్రెస్ గురించి ప్రజలు హేళనగా మాట్లాడుతున్నారు..
కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు..