హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులపై కాల్పుల కలకలం..!!

హైదరాబాద్ గచ్చిబౌలి(Hyderabad Gachibowli)లో కాల్పుల(Firing) కలకలం రేగింది. పోలీసుల(Police)పై దొంగ(Thief) రెండు రౌండ్లు కాల్పులు జరిపారు..కానిస్టేబుల్ సహా బౌన్సర్‌కు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందిస్తున్నారు. ఓ పబ్‌లో దొంగను పట్టుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపినా పోలీసులు సాహసం చేసి దొంగను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఘటనపై ఆరా తీశారు. కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ‘దొంగ ఎవరు..?, అతనిపై ఎన్ని కేసులు ఉన్నాయి. ఎంత కాలం నుంచి పరారీలో ఉన్నారు. అసలు దొంగ ఎందుకు కాల్పులు జరిపారు. దొంగకు గన్ ఎక్కడిది.?’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఈ ఘటనతో పబ్ లోపలా, బయటా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. దొంగ కాల్పులు జరుపుతున్న సమయంలో ఏం జరుగుతుందో అర్ధం కాక గందరగోళానికి గురయ్యారు. పోలీసులు, దొంగలను చూసి ఒక్కసారిగా హడలిపోయారు. ఆందోళన చెందారు. దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఊపరి పీల్చుకున్నారు. మరోవైపు దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసులపై కాల్పులు

గచ్చిబౌలిలోని ఓ పబ్లో శనివారం రాత్రి దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడు పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అలాగే కానిస్టేబుల్తో పాటు పబ్లో ఉన్న ఒక బౌన్సర్కు తీవ్ర గాయాలయ్యాయి..

పోలీసుల అదుపులో దొంగ

అయితే దొంగ కాల్పులు జరిపినప్పటికీ పోలీసులు సాహసం చేసి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. ఈ కాల్పుల ఘటన గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక దొంగను పట్టుకున్న పోలీసులు.. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్గా చెబుతున్నారు.!!!