విదేశాల నుంచి వచ్చిన ఇమ్మడి రవిని..
సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్మెంట్లో శుక్రవారమే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయం ఒకటి బయటపడింది.
ఇమ్మడి రవికి, అతని భార్యకి కొంత కాలంగా తగాదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం కేసు కోర్టులోనూ నడుస్తోంది కూడా. ఈ క్రమంలో.. విడాకుల కేసు కోసమే రవి ఇండియాకు వచ్చాడు. ఈ కోపంలోనే భర్త వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అతని భార్యే అందించినట్లు తెలుస్తోంది. అలా.. భార్య అందించిన టిప్పుతో రవి హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు.
చంచల్‌గూడ జైలుకు రవి..
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు మెజిస్ట్రేట్ నివాసంలో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో రవిని 7 రోజులపాటు పోలీసులు కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. I BOMMA , BAPPAM వెబ్ సైట్లను పోలీసులు బ్లాక్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. పైరసీ కంటెంట్‌తో బెట్టింగ్ యాప్‌లను సైతం ప్రమోట్ చేశాడని తెలుస్తోంది.
కంటెంట్‌ను ఆపేసి..
ఇక విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి కీలక సమాచారం రాబట్టారు. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను నిలిపివేశారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లనూ కూడా గుర్తించారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు..
ఇమ్మడి రవి స్వస్థలం విశాఖలో స్థానిక పోలీసుల సహాయంతో ఈ ఉదయం నుంచి సీసీఎస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. అతని స్నేహితులనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి సంబంధించిన రూ.3 కోట్ల ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది.
గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో గతంలో పోలీసులకి, సినీ పెద్దలకి ఐ-బొమ్మ ఓ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ దాకా వస్తే.. పోలీసుల సంగతి చూడాల్సి వస్తుందంటూ ఓ బహిరంగ పోస్ట్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ వ్యవహారంలోనూ రవి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఐ-బొమ్మ కారణంగా.. సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా రూ.22వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ పైరసీ ద్వారా కొన్నేళ్లుగా రూ.వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్టుగా గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌లో రవి పాత్ర ఇంకా ధృవీకరణ కావాల్సి ఉంది. ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్ వర్క్ ఎక్కడెక్కడ ఉంది? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు..
ఒక్కడు ఇన్నికోట్ల నష్టమా..
రవికి చెందిన సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.కొంతకాలం క్రితమే తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఐ బొమ్మపై ఫిర్యాదులు నమోదు చేసింది. ఈ పరిస్థితుల్లో గతంలో ఐ బొమ్మ సంస్థ పోలీసులు, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఒక బెదిరింపు పోస్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులో కూడా రవి పాత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దర్యాప్తు వివరాల ప్రకారం, ఐ బొమ్మ కారణంగా సినిమా పరిశ్రమ గత కొన్నేళ్లుగా సుమారు ₹22 వేల కోట్లు నష్టం చవిచూసిందని అధికారులు తెలిపారు. ఈ పైరసీ వ్యవహారం ద్వారా రవి వందల కోట్ల రూపాయలు సంపాదించినట్టు గుర్తించబడింది. అయితే ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరు ఉన్నారు? అసలు వ్యవస్థ ఎలా నడుస్తోంది? అన్న దానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.విచారణ పూర్తయిన తర్వాత అన్ని వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు..
విడాకుల కోసం హైదరాబాద్ వచ్చిన ఐ బొమ్మ రవి
గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్న రవి ఒక్కసారిగా అరెస్టు కావడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్ కు చెందిన వ్యక్తి. అయితే హైదరాబాదులో కూకట్ పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు. ఇక రవికి గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విభేదాలు కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు(Divorce) తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఈయన హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా రవి భార్య(Ravi Wife) సమాచారాన్ని అందవేసినట్టు తెలుస్తుంది.
పోలీసులకు సమాచారం ఇచ్చిన రవి భార్య..
ఈ విధంగా రవి భార్య సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా ఉంచి ఆయనని పక్కా పథకం ప్రకారం అరెస్టు చేశారని స్పష్టమవుతుంది. ఇలా ఈయన అరెస్ట్ వెనుక తన భార్య ప్రమేయం ఉందనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కట్టుకున్న భార్య తన పాలిట శత్రువులా మారింది అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం రవి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేస్తూ చిత్ర పరిశ్రమకు ప్రాణం పోసారంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు.
నాంపల్లి కోర్టుకు ఐ బొమ్మ రవి..
ఇక పోలీసుల అదుపులో ఉన్న రవి నుంచి కొన్ని హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈయన నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు మరి కాసేపట్లో తనని నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరు పరచనున్నట్టు తెలుస్తుంది. ఇలా సినిమా పైరసీ కారణంగా చిత్ర పరిశ్రమకు కొన్ని వేలకోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చిన రవికి కోర్టు ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా మూవీ పైరసీ తిమింగలం పోలీసులకు చిక్కడంతో చిత్ర పరిశ్రమ, నిర్మాతలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మూవీ పైరసీని అడ్డుకోవడం కోసం చిత్ర నిర్మాతలు, పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ పైరసీ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని పైరసీ పై ఉక్కు పాదం మోపుతున్నారు.