కపిల్ దేవ్, బోథమ్‌ సరసన టీమిండియా ఆల్ రౌండర్ గా జడేజా అరుదైన ఘనత…!.

ఈడెన్ గార్డెన్స్‌లో జతొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(4-29) స్పిన్ మ్యాజిక్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తోకముడవగా మ్యాచ్ టీమిండియా గుప్పిట్లోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యమే వచ్చినా.. స్పిన్ ద్వయం కుల్దీప్, జడ్డూలు తిప్పేయడంతో రెండో ఇన్నిగ్స్‌లోనూ పర్యాటక జట్టు ఆలౌట్ ప్రమాదంలో పడింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయగా కెప్టెన్ తెంబ బవుమా(29 నాటౌట్) పోరాడుతున్నాడు. రెండోరోజు మ్యాచ్‌ను శాసించిన భారత్ మూడో రోజే జయభేరి మోగించడం ఖాయం..సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌లోనూ భారత జట్టు గెలుపు వాకిట నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో.. బౌలర్ల జోరుతో టీమిండియా పట్టుబిగించింది. ఓవర్ నైట్ స్కోర్‌ 37/1తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను.. లెగ్ స్పిన్నర్ హర్మాన్(4-30) దెబ్బకొట్టాడు. అతడి విజృంభణతో ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ చేరగా.. దక్షిణాఫ్రికాకు 30 పరుగుల ఆధిక్యం లభించింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌లో గొప్పగా ఆడి మ్యాచ్‌లో నిలవాలనుకున్న సఫారీలకు రవీంద్ర జడేజా(4-29) దిమ్మదిరిగే షాకిచ్చాడు. అతడికి చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(2-12) కూడా తుడవడం.

అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 37/1తో రెండో రోజు ఆటను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 152 ప‌రుగులు జోడించి మిగిలిన వికెట్లను కోల్పోయింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 189 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ కు 30 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (39) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్ (29), రిషభ్‌ పంత్ (27), రవీంద్ర జడేజా (27) ప‌ర్వాలేద‌నిపించారు..ఇక టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ బ్యాటింగ్ చేస్తుండ‌గా మెడ ప‌ట్టేయ‌డంతో రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు తీయ‌గా.. మార్కో జాన్సెన్ మూడు, కేశవ్‌ మహరాజ్‌, కోర్బిన్‌ బోష్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే..

భారత తొలి క్రికెటర్‌గా రికార్డు
ప్రొటిస్‌ బ్యాటర్లు ఐడెన్‌ మార్క్రమ్‌ (4), వియాన్‌ ముల్దర్‌ (11), టోనీ డి జోర్జి (2) రూపంలో మూడు వికెట్ల తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (5)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 250 వికెట్ల క్లబ్‌లో చేరిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.

ప్రపంచంలో రెండో ప్లేయర్‌గా
అంతేకాదు.. ఓవరాల్‌గా ప్రపంచంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన (స్వదేశంలో 2000+ 250 వికెట్లు) రెండో ఆటగాడిగా జడేజా నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో ఓవరాల్‌గా నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కి పైగా వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్‌గా ఫీట్‌ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్‌ బోతమ్‌, కపిల్ దేవ్‌, డానియెల్‌ వెటోరి జడ్డూ కంటే ముందు వరుసలో ఉన్నారు..