గణేశ్‌ ఆలయ పూజారి ఇంట్లో ఇఫ్తార్ విందు…!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టేషన్‌ బస్తీలోని గణేశ్‌ ఆలయ పూజారి హరగోపాల్‌ శర్మ గురువారం ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇచ్చారు..ప్రస్తుతం రంజాన్‌ ఉపవాస దీక్షలు కొనసాగుతుండగా.. రోజా పాటించే వారిని సాయంత్రం ఆహ్వానించిన శర్మ.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పలు రకాల వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగా అక్కడి ముస్లింలు శర్మను అభినందించారు.