ఇజ్రాయెల్‌కు ప్రధాన ఆయుధంగా హెర్మెస్ 900.. హెర్మెస్ 450 డ్రోన్లు ..

మిడిల్‌ఈస్ట్‌లో మారుతున్న యుద్ధానికి అనుగుణంగా ఇజ్రాయెల్ తన వ్యూహాలను మార్చుకుంటూ వేళ్తోంది. ప్రత్యక్షంగా యుద్ధంలో సైనికులను మోహరించడం కన్నా తమ కమాండ్ సెంటర్ నుంచే శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే అత్యాధునిక సాంకేతికతపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, లెబనాన్‌లతో జరుగుతున్న పోరులో ఇజ్రాయెల్ వద్ద ఉన్న రెండు ‘బ్రహ్మాస్త్రాలు’ వాడుతోంది. అవే ఒకటి హెర్మెస్ 450, రెండోది హెర్మెస్ 900 డ్రోన్లు. ఈ మానవరహిత వైమానిక వాహనాలు గాజా నుంచి ఇరాన్ సరిహద్దుల దాకా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి…

హెర్మెస్ 450 డ్రోన్..

ఈ యుద్ధ వ్యూహంలో ‘హెర్మెస్ 450’ డ్రోన్ ఇజ్రాయెల్‌కు ప్రధాన ఆయుధంగా ఉంది. ఇది గాలిలో ఏకధాటిగా 20 గంటల పాటు ఉండి శత్రువుల నిరంతర కదలికలను పర్యవేక్షించగలదు. ఇది కేవలం గూఢచర్యానికే పరిమితం కాలేదు. ప్రమాదకరమైన స్పైక్ క్షిపణులతో లక్ష్యాలను క్షణాల్లో నాశనం చేయగలదు.

హెర్మెస్ 900 డ్రోన్..

హెర్మెస్ 900 డ్రోన్.. హెర్మెస్ 450 కన్నా మరింత ప్రమాదకారమైనది. ఇది 30,000 అడుగుల ఎత్తులో సుమారు 30 గంటల పాటు నిరంతరం ఎగరగలదు. 300 కిలోల బరువుండే భారీ బాంబులు, క్షిపణులను మోసుకెళ్లగలదు. ఇందులో అమర్చిన అత్యాధునిక రాడార్ సెన్సార్లు చాలా శక్తివంతమైనవి. చివిరికి గోడల వెనుక దాక్కున్న శత్రువులను కూడా ఇవి పసిగట్టి ధ్వంసం చేయగలవు..