జనగామలో కలకలం..!
బస్టాండ్ దగ్గరే పట్టుబడిన కిడ్నాపర్.
జనగామ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం – నిందితురాలిని పట్టుకున్న తల్లిదండ్రులు జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక యువతి చొరబడి, ఓ పసిబాబును కిడ్నాప్ చేసి పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనతో అప్రమత్తమైన బాబు తల్లిదండ్రులు వెంటనే స్పందించి ఆమెను వెంబడించారు. చివరకు జనగామ బస్టాండ్ సమీపంలో ఆ యువతిని పట్టుకున్న తల్లిదండ్రులు, తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించి, నిందితురాలిని వారికి అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.