నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుంది…(ఐఎండీ).

వేసవి ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అడపాదడపా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నా.. ఎండ వేడిమి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే, ఈసారి నైరుతి రుతుపవనాలు తొందరగా వచ్చేస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. తాజా వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది..
దేశంలో మే 25 నుంచి రోహిని కార్తె ప్రారంభమైంది. దాదాపు 14 రోజులపాటు ఈ కార్తె ఉండనుంది. రోహిణి కార్తె గురించి చెప్పనక్కర్లేదు. రోళ్లు బద్దలయ్యేలా ఎండలు కాస్తాయని పంచాంగాలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పుడు అదే పరిస్థితి నెలకుంటుంది. ఎందుకంటే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కనిపించలేదు.

మే 26 నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పుడు రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. జూన్ ఫస్ట్ వీక్ అంటే నాలుగు లేదా ఐదు నాటికి రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ..

జూన్ తొలి వారానికే.. దంచి కాయనున్న ఎండలు

ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యాయి. గడిచిన పదేళ్లలో పరిశీలిస్తే ఐఎండీ అంచనాలు మరోసారి తారుమారు అయ్యాయి. కేరళను తాకిన మూడు రోజులకు తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

కేరళాకు రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో ఉత్తర భారత్కు మరింత లేటు కానుంది. ఆ లెక్కన జూన్ చివరి నాటికి ఢిల్లీకి నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది. ప్రారంభంలో నెమ్మదిగా సాగిన రుతుపవనాలు ఆ తర్వాత వేగంగా ముందుకు సాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు…

రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే ఆదివారం ఒక్కరోజే దాదాపు 42మంది మృతి చెందారు. ఒక్క వరంగల్‌లోనే అత్యధికంగా 20మంది మృతి చెందగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10మంది, కరీంనగర్‌లో 8 మంది, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా 43 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు హెచ్చరించారు..