శాంతి ఒప్పందాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తున్నట్లు ఇరాన్…

గత నెలలోనే ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని పూర్తిగా పక్కనపెట్టేస్తున్నట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఈ ఒప్పందంలోని నిబంధనలకు ఇకపై తాము కట్టుబడి ఉండబోమని స్పష్టం చేసింది. అయితే శాంతి ఒప్పందాన్ని మొదట ఉల్లంఘించింది అమెరికాయేనని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు:

ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Iran-US War) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇరాన్‌తో చాప్టర్ ముగిసిందని, వారితో వ్యవహరించడం సమయం వృథా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం, అణు కార్యక్రమంపై చర్చలే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఇటీవల హోర్ముజ్ ప్రాంతంలో మూడు కమర్షియల్ నౌకలపై జరిగిన దాడులే ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇరానే ఈ దాడులకు పాల్పడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపిస్తోంది.