ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం రాత్రి రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరిగింది. ఈ వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈనెల 18వ తేదీన జరగనుంది..తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 284 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (56) రాణించగా.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీ, రోహిత్ సహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. అయితే, భారీ లక్ష్యంతో బరిలోకిదిగిన న్యూజిలాండ్ జట్టు 47.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 286 పురుగులు చేసింది. విల్ యంగ్ (87) రాణించగా.. మిచెల్ (131 నాటౌట్) సెంచరీతో న్యూజిలాండ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఏడు వికెట్ల తేడాతో ఇండియా ఓటమి అవ్వడం జరిగింది…
ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్ యాదవ్ ప్రారంభం నుండి చివరి వరకు అంటే 10 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా అనుభవం కూడా సహాయపడలేదు. అతను 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాడు. కుల్దీప్ బౌలింగ్‌లో 80 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద ప్రసిధ్ వదిలేయడం కూడా కివీస్ జట్టుకు కలిసొచ్చింది…
భారత ఇన్నింగ్స్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 284/7 స్కోరు సాధించింది. ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ స్టార్టర్లు విఫలమైనా, కెఎల్ రాహుల్ (112* నాటౌట్, 92 బంతుల్లో) అద్భుత సెంచరీతో జట్టును బాగా ఆదుకున్నాడు. ఇది అతని ODIల్లో 8వ సెంచరీ. శుభ్‌మన్ గిల్ అర్థసెంచరీ (56) స్కోరు చేశాడు. మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను కట్టడి చేశారు కానీ రాహుల్ ఫినిషింగ్‌తో స్కోరు 284 కి చేరింది.
కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 92 బంతుల్లో 112 నాటౌట్‌గా నిలిచాడు (11 ఫోర్లు, 1 సిక్స్). రాహుల్ 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు, ఒక అరుదైన రికార్డుకూడా నెలకొల్పాడు. నంబర్ 5 ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి, వికెట్‌కీపర్‌గా న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
ఇక, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్) ఓపెనర్‌గా వచ్చి 56 పరుగులు (53 బంతులు) చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాప్ స్కోరర్లలో రెండో స్థానంలో నిలిచాడు. అయితే, భారత టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్ లో విఫలమైంది. రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. పవర్‌ప్లేలో 57/0 అయినా, మిడిల్ ఓవర్లలో రన్ రేట్ పడిపోయింది. రవీంద్ర జడేజా 27, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా చిన్న కాన్ట్రిబ్యూషన్లు ఇచ్చారు. మొహమ్మద్ సిరాజ్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఇన్నింగ్స్ ముగించాడు.