పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..!

వరల్డ్ కప్‌లోనే కాదు ఆసియా కప్‌లోనూ తమకు తిరుగులేదని చాటుతూ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది భారత జట్టు. ఆదివారం చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించిన టీమిండియా ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దుబాయ్‌ స్టేడియంలో కుల్దీప్ యాదవ్ విజృంభణలో 127కే పాక్ పరిమితం అవ్వగా.. ఛేదనలో అభిషేక్ శర్మ (31) బౌండరీల మోతతో మెరుపు ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మూడో వికెట్‌కు తిలక్ వర్మ(31)తో కలిసి 56 రన్స్ జోడించిన సూర్య జట్టు విజయానికి బాటలు వేశాడు. ఫినిషర్ శివం దూబే(10 నాటౌట్) తనదైన స్టయిల్లో ఆడగా.. సిక్సర్‌తో భారత్‌కు 7 వికెట్ల విజయాన్ని అందించాడు సూర్య..ఆసియా కప్‌లో బాయ్‌కాట్ నిరసనల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయఢంకా మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను వణికిస్తూ భారీ విక్టరీతో ఈజీ కాదని మరోసారి చాటింది. తొలుత పాక్‌ను 127కే నిలువరించిన నిర్దేశించిన టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే అందుకుంది. దాయాది నిర్దేశించిన ఛేదనను భారత్ ధాటిగా మొదలెట్టింది. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో మొదటి రెండు బంతులకు అభిషేక్ శర్మ 4, 6 బాదాడు. రెండో ఓవర్లో సయీం అయూబ్‌ను ఉతికేస్తే శుభ్‌మన్ గిల్(10) రెండు ఫోర్లు కొట్టాడు..