పాకిస్తాన్..చైనా, టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి వేళ…భారత సైన్యం సరిహద్దులో సామర్థ్యాన్ని ప్రదర్శించింది…!
మన దాయాది దేశం పాకిస్తాన్..చైనా, టర్కీ నుంచి భారీగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. ఈ సమయంలో భారత సైన్యం అప్రమత్తం అయింది. సరిహద్దులో తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది..రాజస్థాన్లోని జైసల్మేర్-బార్మేర్ సెక్టార్లో భారత్మాల హైవేపై ఏహెచ్ – 64 అపాచీ, ఏఎల్ హెచ్ రుద్ర హెలికాప్టర్లతో ల్యాండింగ్, టేకాఫ్ డ్రిల్స్ నిర్వహించి సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బార్డర్లో బల ప్రదర్శన..
భారత్ పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దీటుగా సరిహద్దు ప్రాంతంలో ఆధునిక హెలికాప్టర్ల బాల ప్రదర్శన చేసింది. జైసల్మేర్-బార్మేర్ సెక్టార్ భారత్-పాక్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ భారత్మాల హైవేను రన్వేలా మార్చి అపాచీ, రుద్ర హెలికాప్టర్లు ల్యాండ్ అయి, తిరిగి టేకాఫ్ అయ్యాయి. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ రన్వేలు దెబ్బతిన్నా, హైవేలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సామర్థ్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది. ఇక అపాచీ హెలికాప్టర్లు అధునాతన దాడి సామర్థ్యం కలిగి ఉండగా, రుద్ర భారతీయ నిర్మిత గన్షిప్గా బహుళ పాత్రలు పోషించగలదు. ఈ డ్రిల్స్ సైనికుల శిక్షణను, సమన్వయాన్ని పెంచడమే కాకుండా, శత్రు దేశాలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి.