భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ‘దేశ్ బచావో మోర్చా’ పిలుపుతో మళ్లీ నిరసనలు…!

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ‘దేశ్ బచావో మోర్చా’ పిలుపుతో మళ్లీ నిరసనలకు దిగారు. దిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద ‘మహా పంచాయత్’ నిర్వహించేందుకు పాటియాలా నుండి వేలాది మంది రైతులు శంభు సరిహద్దుకు చేరుకుంటున్నారు. దీంతో హర్యానా పోలీసులు కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి రవాణాను నిలిపివేశారు…

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరో కొత్త సవాలు ఎదురుకానుంది.

భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు జూలై 21న ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
అదే రోజు ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద ఒకరోజు మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి దేశ్ బచావో మోర్చా నాయకత్వం వహిస్తుండగా, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యే అవకాశం ఉందని రైతు సంఘాలు తెలిపాయి.