భారత్‌ రష్యా సైనిక ఒప్పందం,ఒకరి భూభాగంలో మరొకరి సైనిక స్థావరాలు..!

ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా భారత్‌-రష్యాల మధ్య కుదిరిన సైనిక ఒప్పందం అమల్లోకి వచ్చింది..
India and Russia have formalised a defence arrangement enabling …
దీని ప్రకారం ఒకరి భూభాగంలో మరొకరు 3,000 మంది వరకు సైనిక సిబ్బందిని నిలిపి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. విమానాలు, నౌకలను కూడా నిలుపుకోవచ్చు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవీయ సాయం తదితర అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటనకు ముందు కుదిరిన సైనిక వసతి తంత్ర పరస్పర మార్పిడి ఒప్పందం (రెసిప్రోకల్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ అగ్రిమెంట్‌-ఆర్‌ఈఎల్‌ఓఎస్‌) ప్రకారం సహకారం అందించుకుంటాయి. యుద్ధ నౌకలు, విమానాలు రెండు దేశాల గగనతలాన్ని, నౌకాశ్రయాలను కూడా ఉపయోగించుకోవచ్చు.