పాకిస్తాన్ భారత్ బోర్డర్‌లో హై టెన్షన్..అసలు నిజం ఇదే…!

దాదాదిగా 10 నుంచి 15 నిమిషాల పాటు కాల్పులు..

పాకిస్తాన్ భారత్ బోర్డర్‌లో హై టెన్షన్ నెలకొంది… జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది..దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు కాల్పులు జరిపిందని తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఎలాంటి కాల్పులు జరగడం లేదు. అయితే ఉగ్రవాదులు మళ్లీ ఎంటర్ కావడానికి ప్రయత్నించే అవకాశం ఉందని సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్ఓసి వెంబడి హై అలర్ట్ ప్రకటించారు..

అసలు నిజం ఇదే..

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిందని వార్తలు ప్రచారమైనప్పటికీ అలాంటి సంఘటన ఏదీ జరగలేదని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి పుకార్లు వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరగలేదని ధృవీకరించింది. కాబట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పవచ్చు.