భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం అయితే అక్కడికి పారిపోతా..! పాకిస్తాన్ ఎంపీ కామెంట్స్..!

భారత్-పాకిస్తాన్ మధ్య పహల్గాం దాడి తర్వాత ఉద్రికతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
https://x.com/ChillamChilli/status/1918739029769466146
ఇప్పటికే ఇరుదేశాలూ ఆంక్షలు విధించుకోవడం, ఒప్పందాలు నిలిపివేయడం, దిగుమతుల రద్దు వంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఏ క్షణమైనా పాకిస్తాన్ పై భారత్ దాడి చేయొచ్చన్న చర్చ ఇరుదేశాల్లోనూ సాగుతోంది. అంతే కాదు భారత్-పాక్ యుద్ధం వస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటూ మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి..ఇదే క్రమంలో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు షేర్ అఫ్జల్ ఖాన్ మర్వత్ ను కూడా భారత్-పాకిస్తాన్ యుద్దంపై ఓ విలేకరి ఓ ప్రశ్న అడిగారు. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే మీరు సరిహద్దులకు వెళ్లి పోరాడతారా అంటూ ఆయన్ను ప్రశ్నించాడు. దీనికి అఫ్జల్ ఇచ్చిన స్పందన చూసి సదరు విలేకరి సైతం షాకయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు పలు దేశాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సదరు ఎంపీ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా ? భారత్ తో యుద్దమే కానీ వస్తే తాను ఇంగ్లాండ్ వెళ్లిపోతానన్నాడు..